కేరళ వయనాడ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వయనాడ్ బాధితులకు సహాయం చేసేందుకు గానూ కేరళ ప్రభుత్వానికి ఏపీ రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చింది. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి ఈ మొత్తాన్ని కేరళ ప్రభుత్వానికి అందజేశారు. మరోవైపు వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో సుమారుగా 300 మంది చనిపోయారు. మరెంతో మంది గాయపడ్డారు. ఈ విపత్తుల వేళ కేరళ ప్రభుత్వానికి టాలీవుడ్ సినీ హీరోలతో పాటుగా పలువురు ప్రముఖులు విరాళాలు ఆందించారు.