వరద నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. ఇటీవల కురిసిన వర్షాలు, సంభవించిన వరదల కారణంగా ఏపీలో రూ.6,882 కోట్లు నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదిక రూపొందించారు. వరదల కారణంగా అత్యధికంగా ఆర్ అండ్ బీ శాఖకు నష్టం జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను త్వరలోనే కేంద్రానికి నివేదించనున్నారు. ఈ నివేదిక, కేంద్ర బృందం సమర్పించే రిపోర్టు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి వరద సాయం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ తెలంగాణకు కలిపి రూ.3,300 కోట్లు వరద సాయాన్ని కేంద్రం విడుదల చేసిందని వార్తలు రాగా.. ఏపీ ప్రభుత్వం తోసిపుచ్చింది.