AP new Excize policy starts from october: నూతన మద్యం పాలసీని అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. మద్యం విధానం రూపకల్పన కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ నాలుగు బృందాలు వివిధ రాష్ట్రాలలో పర్యటించి అక్కడ అమల్లో ఉన్న మద్యం పాలసీలను పరిశీలిస్తాయి. అనంతరం ఆగస్ట్ 12వ తేదీలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాయి. ఈ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రూపొందించనుంది. ఇక ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు.