ఏపీలో ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను బుధవారం ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఉదయం పది గంటల 31 నిమిషాలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్ సైట్‌తో పాటుగా.. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా తెలుసుకునేందుకు అవకాశం కల్పించారు.