నూతన మద్యం విధానంపై కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల్లో గౌడ, ఈడిగ సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఈ తరహాలోనే ఏపీలోనూ గౌడ, ఈడిగలకు మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం జిల్లా కలెక్టర్లతో జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబు దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గౌడ, ఈడిగ సామాజికవర్గాలకు 15 నుంచి 20 శాతం మద్యం షాపులు కేటాయించే దానిపై ఆలోచన చేయాలని సూచించారు.