AP Liquor Shops Draw: ఏపీలో మద్యం షాపులకు సంబంధించిన లాటరీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో లాటరీ నిర్వహించనున్నారు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు. లాటరీ ప్రక్రియ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. లాటరీ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఎంపికైన వారి వివరాలను అధికారులు వెల్లడిస్తారు. షాపులకు సంబంధించిన ప్రక్రియను 15వ తేదీ పూర్తి చేసి షాపులను లాటరీలో ఎంపికైన వారికి అప్పగిస్తారు. 16వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం షాపులు అమ్మకాలను ప్రారంభించే అవకాశం ఉంటుంది.