ఏపీ స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలపై సచివాలయంలో సమీక్షించిన చంద్రబాబు.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఐటీ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలన్న చంద్రబాబు.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏపీని దేశంలోనే నంబర్ వన్ చేయాలని సూచించారు. అలాగే పౌరులకు అన్ని పౌరసేవలు ఒకేచోట అందించేలా యాప్ తీసుకురావాలని.. ఈ తరహా అప్లికేషన్‌కు అధికారులు రూపకల్పన చేయాలని చంద్రబాబు ఆదేశించారు.