ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చేతివృత్తుల వారికి అండగా నిలవడంతో పాటుగా డ్వాక్రా మహిళలకు ఆర్థిక దన్నుగా నిలిచే ఉద్దేశంతో మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకమైన స్ఫూర్తి పథకాన్ని ఏపీలోని డ్వాక్రా మహిళల కేంద్రంగా అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలివిడతగా రాష్ట్రంలోని 11 జిల్లాలలో క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో క్లస్టర్‌ను ఒక్కో ప్రాజెక్టుగా భావిస్తారు. ఇక ఒక్కో ప్రాజెక్టుకు కేంద్రం 90 శాతం సబ్సిడీతో రూ.5 కోట్లు రుణం కేటాయించనుంది.