బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మీద కేసు నమోదైంది. తనను మోసం చేశారంటూ తిరుమలరావు అనే వ్యక్తి తోట చంద్రశేఖర్‌పైనా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరుగురిని ఇందులో నిందితులుగా చేర్చారు. తోట చంద్రశేఖర్‌ను ఏ3గా చేర్చారు. రూ.29 కోట్లు తనను మోసం చేశారంటూ వాకాడ తిరుమలరావు.. తోట చంద్రశేఖర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏపీ ఎన్నికల ముందు నుంచి తోట చంద్రశేఖర్ ప్రత్యక్ష రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు.