ఏపీలోని అవ్వా, తాతలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. పింఛన్‌దారుల సమస్యను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల సమయంలో వేలిముద్రలు స్కాన్ కాక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లు సమకూరుస్తోంది. సచివాలయాల వారీగా వీటిని సరఫరా చేయనున్నారు. కొత్త స్కానర్ల ద్వారా వేలిముద్రల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు.