AP Projects: ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఏకంగా రూ.10 వేల కోట్లతో పెట్టుబడి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. ఆ జిల్లాలో ఏర్పాటు కానున్న ప్రాజెక్టుతో రూపురేఖలే మారిపోనున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సంబంధిత సంస్థ ప్రతినిధులు ఇప్పటికే భూములను కూడా పరిశీలించగా.. త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది.