ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం వర్షాలు దంచికొట్టనున్నాయి. ఆదివారం పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తర కర్ణాటక, తెలంగాణను ఆవరించి ఉన్న ఆవర్తనం ప్రభావంతో వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, విశాఖ సహా పలు జిల్లాలలో అనేక చోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.