Andhra Pradesh Rains: ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజలు పగటిపూట బయటకు రావాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావారణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. ఏపీలో నాలుగు రోజుల పాటూ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడతాయంటున్నారు.