Andhra Pradesh Rains: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నాలుగు రోజుల పాటూ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇవాళ శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో, గురువారం రాయలసీమతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో తేలికపాటి వర్షాలకు అవకాశముందన్నారు. ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాలో 11 మండలాలు, శ్రీకాకుళంలో 6, విజయనగరంలో 5, అల్లూరి సీతారామరాజులో 5, తూర్పుగోదావరిలో 2, కాకినాడలో ఒక మండలంలో వేడగాలుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు.