బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరికొన్ని జిల్లాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే తీరం వెంబడి గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.