ఆంధ్రప్రదేశ్‌ను వరుణుడు మరోసారి పలకరించాడు. ఉపరితల ఆవర్తనానికి తోడు బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న అల్పపీడనం ప్రభావంతో మంగళవారం నుంచి ఏపీలో మళ్లీ వానలు కురుస్తున్నాయి. అయితే ఈ అల్పపీడనం బలహీనపడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో కోస్తాంధ్ర జిల్లాలలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అంచనా వేసింది. శ్రీకాకుళం, విశాఖ సహా కోస్తాంధ్ర జిల్లాలలో గురువారం వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.