బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 24 గంటల్లో ఇది మరింత బలపడనుందని వెల్లడించింది. ఆ తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు వెళ్లే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.