ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక.. ఏపీలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. వచ్చే 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఆదివారం ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని తెలిపింది.