ఏపీవాసులకు అలర్ట్.. మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం ఉందని.. ఆదివారం నాటికి ఈ ఆవర్తనం కాస్తా అల్పపీడనంగా బలపడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.