ఏపీలో వాలంటీర్ వ్యవస్థ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీ మంత్రివర్గ సమావేశంలో దీనిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల కాలపరిమితి ముగిసినట్లు అధికారులు మంత్రివర్గం దృష్టికి తీసుకువచ్చారు. కాలపరిమితి ముగిసిన తర్వాత కూడా వారితో రాజీనామాలు చేయించినట్లు తెలిపారు. దీంతో వైఎస్ జగన్ తప్పుడు విధానాలతో పాలన సాగించారని మంత్రులు ఆరోపించారు. మరోవైపు వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.