ఆంధ్రప్రదేశ్‍లో వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ఖండించారు. ఇలాంటి ప్రచారాన్ని నమ్మి వాలంటీర్లు ఆందోళనకు గురికావొద్దని సూచించారు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి వాలంటీర్లకు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వాలంటీర్లను రాజకీయంగా వాడుకున్నది వైసీపీనేనని ఆరోపించిన మంత్రి.. వారి భవిష్యత్తును దెబ్బకొట్టేందుకే ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.వాలంటీర్లకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.