ఆంధ్రప్రదేశ్‌లో గురువారం పలు జిల్లాలలో వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గురు, శుక్రవారం పలు జిల్లాలలో వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే పలు మండలాల్లో వడగాలులు వీయనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. భిన్నమైన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.