Andhra Pradesh Weather: ఏపీలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో వర్షం కురుస్తుండగా.. మరికొన్నిచోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు మందగించటంతోనే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే జూన్ 12 నుంచి వాతావరణం మారే అవకాశం ఉందని చెప్తున్నారు. రుతపవనాలు బలం పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.