AP: ఏప్రిల్ 15 నుంచి కొత్త కార్యక్రమం.. ఇంటింటికీ సచివాలయ సిబ్బంది, రెడీగా ఉండండి..

1 week ago 5
ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసేవలను పారదర్శకంగా, మరింత సులభంగా ప్రజలకు అందించేందుకు వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అందులో భాగంగా ఏప్రిల్ 15 నుంచి ఇంటింటికీ మనమిత్ర పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుంది. ఈ సందర్భంగా పౌరులకు వాట్సాప్ గవర్నెన్స్ మీద అవగాహన కల్పించి.. వారి ఫోన్లలో నంబర్ సేవ్ చేయనున్నారు.
Read Entire Article