ఏపీలో బర్డ్ ప్లూ వైరస్ కారణంగా కోళ్లు భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. గోదావరి జిల్లాల నుంచి ఈ వైరస్ కర్నూలు జిల్లాకు కూడా పాకింది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ వైరస్ భయాలు ఎక్కువయ్యాయి. మరోవైపు బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా బర్డ్ ప్లూ వైరస్ సోకిన కోడి నోటి నుంచి మంటలు అంటూ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజానిజాలు ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.