Kurnool Virus Injection Case: ప్రేమించిన వ్యక్తి తనను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కక్షతో ఓ నర్సు దారుణానికి ఒడిగట్టింది. కర్నూలులో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ ప్రియుడి భార్య అయిన మహిళా డాక్టర్‌కు హెచ్‌ఐవీ పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ చేసింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలైన నర్సుకి.. హెచ్‌ఐవీ బాధితుల రక్తాన్ని అందించిన మిగతా నర్సులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.