అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుంచి గత వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని.. అప్పుడే కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇలాంటి దుర్ఘటనలు జరిగేవి కావని షర్మిల అభిప్రాయపడ్డారు. కొండలు పిండి చేసి ప్యాలెస్‌లు కట్టుకునే తీరిక, డబ్బులు ఉన్న ప్రభుత్వానికి.. కార్మికుల ప్రాణాలు పట్టలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఎసెన్షియా కంపెనీని సీజ్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.