ఇటీవల కాలంలో దొంగతనాలతో పాటు.. ఏటీఎం చోరీలు కూడా పెరిగిపోతున్నాయి. అక్కడ కూడా అతి తెలివి ప్రవర్తించి డబ్బులను కొల్లగొడుతున్నారు. సీసీ కెమెరాలు, సైరన్‌లు ఉన్నాయన్న భయం కూడా లేకుండా.. వాటిని పని చేయకుండా చేసి.. ఏం చక్కా డబ్బులను కాజేసి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దాదాపు రూ.30 లక్షల వరకు చోరీ చేసినట్లు బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు. అసలు ఏం జరిగిందనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.