AV Ranganath: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ - హైడ్రా. ఈ పేరు వింటేనే హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల యజమానులు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ బుల్డోజర్ వచ్చి తమ ఆస్తులను ధ్వంసం చేస్తుందోనని క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ హైడ్రా వెనక ఉన్నది పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ ఏవీ రంగనాథ్. వివిధ స్థాయిల్లో తెలంగాణలో సేవలు అందించిన ఏవీ రంగనాథ్.. ఇప్పుడు హైడ్రా కమిషనర్‌గా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెతికిమరీ ఇలాంటి అధికారిని హైడ్రాకు కమిషనర్‌గా నియమించారని అధికార వర్గాలు చెబుతున్నాయి.