Ayyanna Patrudu on Narsipatnam RTC Depot land Private Lease issue: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నం ఆర్టీసీ డిపోలోని స్థలాన్ని ప్రైవేట్ లీజుకు ఇవ్వడాన్ని అయ్యన్న తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే తాను వద్దంటున్నా లీజుదారులకు అధికారులు సహకరిస్తున్నారని అయ్యన్న ఆవేశంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే స్పీకర్ పదవినైనా వదిలేస్తా కానీ... ఈ స్థలాన్ని ప్రైవేట్‌కు లీజుకు ఇవ్వడాన్ని అంగీకరించనని అయ్యన్నపాత్రుడు తేల్చిచెప్పారు. దీనిపై అసెంబ్లీలో చర్చ పెడతామని స్పష్టం చేశారు.