నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ఆదిత్య 369’ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. 1991లో విడుదలై సంచలన విజయాన్ని సాధించిన ఈ సినిమాను 4K డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో మరింత అధునాతనంగా మళ్ళీ ప్రేక్షకులకు అందిస్తున్నారు.