Begari Kancha: తెలంగాణలో మరో కొత్త నగరాన్ని నిర్మించనుంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు తెలంగాణలో పరిపాలన సాగించిన నాయకులు.. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలను అభివృద్ధి చేశారని.. తమ ప్రభుత్వం నాలుగో సిటీని డెవలప్ చేస్తుందని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలోని బెగరికంచను అద్భుతంగా తీర్చిదిద్ది.. 4 ఏళ్లలోనే న్యూయార్క్ సిటీని తలదన్నేలా అభివృద్ధి చేస్తామని తేల్చిచెప్పారు. విదేశాల నుంచి రూ. వేలకోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి.. అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.