Bhatti Vikramarka: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను అక్రమంగా చెరువు ఎఫ్‌టీఎస్ పరిధిలో నిర్మించారని.. హైడ్రా అధికారులు కూల్చివేయడంపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. నిబంధనల ప్రకారమే అధికారులు ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేశారని స్పష్టం చేశారు. చెరువుల ఆక్రమణలను సహించేది లేదన్న భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నగరంలోని అన్ని చెరువుల లెక్కలు తీస్తామని తేల్చి చెప్పారు.