తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ భయం పెరిగింది. దీంతో జనం చికెన్ నుంచి మటన్, చేపల వైపు మళ్లుతున్నారు. బర్డ్ ప్లూ వైరస్ భయాలతో చికెన్ ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో చేపల మార్కెట్లలో రద్దీ నెలకొంటోంది. అయితే ఇప్పుడు చేపలు కూడా తినాలంటే యపడాల్సిన దుస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలోని కొన్నిచోట్ల బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా చనిపోయిన కోళ్లను చేపలకు ఆహారంగా వేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.