తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన పెద్దమనసు చాటుకున్నారు. గుండెకు రంధ్రం పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నెలరోజుల పసికందు ప్రాణం నిలబెట్టారు. చిన్నారికి శస్త్రచికిత్స అవసరం కాగా.. తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి సకాలంలో సర్జరీ జరిగేలా చూశారు. ప్రస్తుతం ఆపరేషన్ పూర్తి జరిగి.. చిన్నారి కోలుకుంటోంది. దీంతో తమకు అండగా నిలిచిన శ్రీనివాస్‌కు ఆ పసిబిడ్డ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు. బొలిశెట్టి శ్రీనివాస్‌పై నెట్టింట సైతం ప్రశంసలు కురుస్తున్నాయి.