భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ 25వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ సభ కాసేపట్లో జరగనుంది. ఈ సభలో 15 లక్షల మంది పాల్గొనే అవకాశముంది. 2001లో కేసీఆర్ ప్రారంభించిన టీఆర్ఎస్ పార్టీ అనేక ఎత్తు పల్లలాను చవి చూసింది. ఉద్యమ పార్టీగా తన ప్రస్తానాన్ని ప్రారంభించి టీఆర్ఎస్ ఆ తర్వాత రాజకీయ పంథాతో స్వరాష్ట్ర కలను నిజం చేయటంతో పాటు రెండు సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మైలురాళ్లు, కీలక ఘట్టాలు ఓసారి తెలుసుకుందాం.