టీటీడీకి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్ షేక్‌పేట్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయ ఛైర్మన్ అన్నే శ్రీనివాసరావు టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం అందించారు. ఆదివారం రోజున టీటీడీ ఈవో రవిచంద్రను కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందించారు. ఈ సందర్భంగా దాతను ఈవో ప్రశంసించారు. మరోవైపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించింది.