BRS: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రి హరీష్ రావు చేతికి కీలక బాధ్యతలు అప్పగించారు. మళ్లీ రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్‌దేనని తేల్చి చెప్పిన కేసీఆర్.. హరీష్ రావుకు ముఖ్య బాధ్యతలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ ఏడాది పొడవునా నిర్వహించాలని నిర్ణయించారు. అంతేకాకుండా పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత కమిటీలు, ప్లీనరీ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.