తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికావొస్తున్న నేపథ్యంలో.. గులాబీ బాస్ కేసీఆర్ కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈసారి పక్కా ప్లాన్‌తోనే రంగంలో దిగుతున్నారని సమాచారం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిసెంబర్‌తో ఏడాది పూర్తవనుండగా.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయంగా కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.