Bullet Train: హైదరాబాద్ సిగలో మరో మణిహారం వచ్చి చేరనుంది. ఎన్నో రంగాల్లో అగ్రగామిగా నిలుస్తున్న హైదరాబాద్ నగరానికి త్వరలోనే బుల్లెట్ రైలు రాబోతోంది. దేశంలో ఇప్పటికే బుల్లెట్ రైలు నిర్మాణం కొనసాగుతుండగా.. ఆ ప్రాజెక్టులో ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరింది. బుల్లెట్ రైలు కారిడార్ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌కు కూడా బుల్లెట్ రైలు రానుంది. ఈ బుల్లెట్ రైలు పట్టాలెక్కితే.. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు గంటల్లోనే చేరుకోవచ్చు.