ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నివాసంలో నరేంద్ర మోదీని కలిసిన చంద్రబాబు.. పలు అంశాలపై ఆయనతో చర్చించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సహకారం, రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రకటించిన రూ.15 వేలకోట్లు ఆర్థిక సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ సహా పలు విషయాలపై ఆయనతో చర్చించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయిన చంద్రబాబు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు.