ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో పర్యటించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తాడికొండ నియోజకవర్గంలోని పొన్నెకల్లు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ దళిత కుటుంబానికి ఊహించని ఆనందం పంచారు చంద్రబాబు. పొన్నెకల్లు ఎస్సీ కాలనీలో పర్యటించిన చంద్రబాబు.. ప్రవీణ్ అనే యువకుడి మెకానిక్ షెడ్డు వద్దకు వెళ్లారు. ఆ యువకుడితో ముచ్చటించారు. అనంతరం ప్రవీణ్ ఇంటికి వెళ్లారు. అతని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మెకానిక్‌ల సమస్యలను తెలుసుకున్న చంద్రబాబు.. ప్రవీణ్‌కు మంచి శిక్షణ ఇచ్చి, గ్యారేజ్ ఏర్పాటుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. అతని కుటుంబానికి ఇల్లు కూడా మంజూరు చేయాలన్నారు.