ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుమల ఏడుకొండలకు సమీపంలో నిర్మించనున్న ముంతాజ్ హోటల్ ప్రాజెక్టు అనుమతులు రద్దు చేశారు. మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్బంగా ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఏడుకొండలకు సమీపంలో ఎలాంటి కమర్షియలైజేషన్‌కు అనుమతులు ఇవ్వమని చంద్రబాబు తెలిపారు.