CM Chandrababu talks with Youtube CEO on Academy in AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు ప్రారంభించిన చంద్రబాబు ఇప్పుడు అభివృద్ధిపైనా దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీలో అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తాజాగా ఏపీలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటుపై చంద్రబాబు చర్చలు జరిపారు. యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్‌తో చంద్రబాబు ఈ మేరకు చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు.