Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లోని క్రీడాకారులకు చంద్రబాబు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహక నిధులను ఏపీ సర్కార్ తాజాగా విడుదల చేసింది. గత ప్రభుత్వ హయంలో క్రీడాకారులకు ప్రకటించిన ప్రోత్సాహకాలు విడుదల చేయకపోవడంతో.. మంత్రి, శాప్ ఛైర్మన్.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.