Pawan kalyan on Attack on Chilkur Balaji temple head Priest Attack: చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడిని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. దాడి దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదన్న పవన్ కళ్యాణ్.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలని పిలుపునిచ్చారు. దాడి వెనుక కారణాలేంటో తెలుసుకోవాలని, దాడి చేసిన వారిని నడిపిస్తోంది ఎవరో గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.