Fire accident in Chinthapalli Area Hospital:అల్లూరి జిల్లా చింతపల్లి ఏరియా ఆస్పత్రిలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఆస్పతిలో విద్యుత్ మీటర్ రిపేర్ చేస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు, పొగ విస్తరించాయి. అయితే ఏం జరిగిందోననే భయంతో రోగులు వారి బంధువులు బయటకు పరుగులు తీశారు. బాలింతల వార్డులో ఈ ఘటన జరగటంతో బాలింతలు పసి పిల్లలను తీసుకుని బయటకు పరుగులు తీశారు. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. రిపేర్ చేస్తున్న మెకానిక్‌కు గాయాలు కాగా.. విశాఖకు తరలించారు.