చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద బస్సు, లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది చనిపోయారని సమాచారం. మరో 40 మంది గాయపడ్డారు. ప్రమాద తీవ్రత నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అటు సమాచారం అందుకున్న వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని అంబులెన్సులలో సమీప ఆస్పత్రులకు తరలించారు.