చిత్తూరు జిల్లా వి. కోటలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన ఐదు రోజులకే నవ వరుడు కన్నుమూశాడు. అత్తగారింటికి వచ్చిన అల్లుడు అనారోగ్యంతో ఉందని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.