CII Summit 2025 Visakhapatnam : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సు విశాఖలో అట్టహాసంగా శుక్రవారం (నవంబర్ 14) ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 40 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమిట్‌కు ఉపరాష్ట్రపతి హాజరవుతారని తెలుస్తోంది. కాగా, రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో సీఎం చంద్రబాబు తీరిక లేకుండా చర్చలు, సమావేశాల్లో పాల్గొననున్నారు.